దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చేయబోవు ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు

అక్షర ఉదయమ్ – విజయవాడ
ఈ రోజు ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ. ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు మరియు ఇతర పోలీస్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఇంజనీరింగ్ అదికారులతో కలిసి శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భక్తులు అందరూ ఆనందోత్సవాలతో శాంతి భద్రతల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబోవు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు సలహాలు అందించడం జరిగింది.

ఈ నేపధ్యంలో నగర పోలీస్ కమీషనర్ గారు, ఇతర పోలీస్ అధికారులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కోసం మునిసిపల్ ఆఫీస్ వద్ద మరియు హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఏర్పాటు చేయు హోల్డింగ్ ఏరియాలను పరిశీలించి ఏవిధంగా బారిగేటింగ్ చెయ్యాలి భక్తులు లోనికి వెళ్ళడానికి బయటకు రావడానికి ఏర్పాటు చేయు మార్గాల గురించి టెంపుల్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వారికి తగు సూచనలు చేశారు. అదేవిధంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ పరిసరాలు, పద్మావతి ఘాట్, సీతమ్మ వారి స్నాన ఘాట్, భవాని, పున్నమి ఘాట్లను, వినాయకుడి గుడి వద్ద నుండి అమ్మవారి టెంపుల్ వరకు భక్తుల దర్శన నిమిత్తం రావడానికి ఏర్పాటు చేసిన క్యూలైన్లను, అదేవిధంగా దర్శనం అనంతరం భక్తులు వెళ్లు మార్గాలను పరిశీలించి, ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని టెంపుల్ ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు అందించారు.

అదేవిధంగా క్యూ లైన్లు, ఘాట్లు , పార్కింగ్ ప్రదేశాలు, ప్రసాదం కౌంటర్లు మరియు ఇతర ప్రదేశాలలో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు తగు సూచనలను మరియు సలహాలను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారితో పాటు పశ్చిమ జోన్ ఇన్ ఛార్జ్ డి.సి.పి. శ్రీ జి.రామకృష్ణ గారు, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు,శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..