అక్షర ఉదయమ్
Date of Publish : 01 February 2025, 8:57 pm Posted by : అక్షర ఉదయమ్

ఉచిత బస్సు పథకంపై సీఎం చంద్రబాబు క్లారిటీ

అక్షర – అన్నమయ్య జిల్లా

ఉచిత బస్సుపై సీఎం చంద్రబాబు ఓ క్లారిటీ ఇచ్చారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో పర్యటించిన ఆయన ఈ విషయమై స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కోసం ఆర్టీసీ నుంచి వచ్చిన కొత్త బస్సులు, సిబ్బంది అంశంపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ పథకం ప్రారంభ తేదీ మాత్రం సీఎం చెప్పలేదు.