నేరాల నియంత్రణే ధ్యేయంగా కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్లు

అక్షర ఉదయమ్ – పల్నాడు
పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధి కోట నెమలిపురి గ్రామం నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నందు రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీ లలో గ్రామంలో సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 2 గడ్డ పలుగులు స్వాధీనపర్చుకోవడమైనది.

ఫుట్ పెట్రోలింగ్, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన చేశారు.
అంతేకాకుండా రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇళ్లను తనిఖీ చెయ్యడం జరిగింది.
గ్రామంలో నాటు సారా, గుట్కా, గంజాయి నియంత్రణ కోసం అనుమానితుల/పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలు, దుకాణాల లో క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగించారు.

అక్రమ మద్యం,గంజాయి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
పాత కేసుల్లో నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి డి.ఎస్పి M. హనుమంతరావు గారు, సత్తెనపల్లి రూరల్ సీఐ P.కిరణ్ గారు, సత్తెనపల్లి టౌన్ సిఐ N.నాగ మల్లేశ్వర రావు గారు, అచ్చంపేట సీఐ P. శ్రీనివాసరావు గారు, 7 మంది ఎస్సైలు మరియు 64 మంది సిబ్బంది పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.