రాష్ట్రంలో రానున్న రెండు రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 38°C-40°C మధ్య నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా...