స్వదేశీ దర్శన్-2.0 కింద సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు 16వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు

అక్షర ఉదయమ్ – బాపట్ల
స్వదేశీ దర్శన్-2.0 అభివృద్ధి పనులపై అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు.
సూర్యలంక బీచ్ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్-2.0 కింద రూ.97.52 కోట్లు నిధులను విడుదల చేసిందన్నారు. 3.5 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్నారన్నారు. మరో రెండు ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత దుకాణాల నిర్మాణం, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. 1.5 కిలోమీటర్ల దూరం వరకు బోట్ ల ద్వారా కెనాల్లో పర్యటించేందుకు అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటకులను మరింత ఆకర్షించేలా పరిసరాలు సుందరంగా తీర్చి దిద్దాలన్నారు. బీచ్ వద్ద మంచి మొక్కలు నాటాలని, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా నిర్మాణాలు జరగాలన్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ ప్రాంతంలో శాశ్వతంగా దుకాణాలు నిర్మిస్తున్నామన్నారు. బీచ్ అభివృద్ధి పనులు 2026 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. పనులు వేగంగా చేపట్టాలని సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులకు ఆయన పలు సూచనలు చేశారు. బీచ్ వద్ద సురక్షితమైన తాగునీటి వనరులు లేనందున తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలన్నారు.

వాడరేవు – చిలకలూరిపేట జాతీయ రహదారి 167 ఏ నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. 47 కిలోమీటర్ల పొడవునా నిర్మించే రహదారి బాపట్ల జిల్లాలోనే 35 కిలోమీటర్ల పొడవున వెళ్తుందన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, తదితరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటివరకు 92.38% రహదారి నిర్మాణం పూర్తి చేసినట్లు వివరించారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. నాణ్యత పరీక్షలు నిర్వహిస్తామని, నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. చీరాల వాడరేవు బీచ్ వద్ద జాతీయ రహదారి నిర్మాణం ముగుస్తున్నందున చిన్న పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటకులకు సుందరంగా దర్శనమిచ్చేలా పార్క్ నిర్మాణం జరగాలన్నారు. జిల్లాలో వెళ్లే రహదారికి ఇరువైపులా 5,500 మొక్కలు నాటాలన్నారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఆహ్లాదంగా అనుభూతి కలిగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆక్వా పార్క్ 192.42 ఎకరాలలో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. సమీకృత ఆక్వా పార్క్ నిర్మాణం ద్వారా ఆక్వా రంగం మరింత అభివృద్ధి కానుందన్నారు. మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. వివిధ రకాల మత్స్య సంపద అభివృద్ధికి ఈ పార్క్ కేంద్ర బిందువు కానందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు రూ. 88.08 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లా అభివృద్ధిలోనూ ఆక్వా పార్క్ ప్రాధాన్యత సంతరించుకోనుందన్నారు. నిజాంపట్నం ఓడరేవు 60 శాతం నిర్మాణం పూర్తయిందన్నారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, ఏజెన్సీ ప్రతినిధులు, ఎన్ హెచ్ ఎ అధికారులు, గుత్తేదారుడు దిగ్విజయ్ సింగ్, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.