గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
- 9 మర బోట్ లు, 6 ATV వాహనాలతో పాండురంగాపురం నుండి చిన్నగంజాం వరకు సముద్రతీరంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాము
- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 8 డ్రోన్లను వినియోగిస్తున్నాము
- 100 మీటర్ల ఎత్తు నుండి 5 KM దూరాన్ని నిశితంగా పరిశీలించగలిగే ప్రత్యేకమైన Tethared డ్రోన్‌ను సైతం వినియోగిస్తున్నాము
- 70 మంది పోలీస్ అధికారులు సిబందిని, 30 మంది మెరైన్, 20 మంది ఫైర్, 25 మంది గజ ఈతగాళ్లను బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాము
- జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
అక్షర ఉదయమ్ – చీరాల
బాపట్ల జిల్లా చీరాల వాడరేవు సముద్రతీరంలో గత ఆదివారం 5 గురు యువకులు గల్లంతైన విషాదకరమైన ఘటన విదితమే. గల్లంతైన వారిలో 4 గురు యువకులు మృతి చెందారు వారిని గుర్తించడం జరిగింది. కూచిన షారోన్ రాజు ఆచూకీ లభ్యంగా కాలేదు. అతడి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలను మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు స్వయంగా పరిశీలించారు.

కూచిన షారోన్ రాజు ఆచూకీ కోసం సుమారు రెండు రోజులుగా పోలీస్ యంత్రాంగం ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. 70 మంది పోలీస్ అధికారులు సిబ్బందిని, 30 మంది మెరైన్, 20 మంది ఫైర్, 25 మంది గజఈతగాళ్లను బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వీరిని 9 పడవల సహాయంతో సముద్రంలో, 6 ATV వాహనాల సహాయంతో పాండురంగాపురం నుండి చిన్నగంజాం వరకు సముద్రతీరంలో ముమ్మరంగా గాలింపు చేపడుతున్నామన్నారు.

అంతేకాకుండా అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 8 డ్రోన్లను వినియోగించి సముద్రతీరాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. 100 మీటర్ల ఎత్తు నుండి 5 కిలోమీటర్ల దూరంలో వున్నవారిని కూడా స్పష్టంగా గుర్తించగలిగే ప్రత్యేక Tethared డ్రోన్‌ను సైతం వినియోగిస్తున్నామన్నారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. అతిత్వరలోనే కూచిన షారోన్ రాజు ఆచూకీ కనుగొంటామని ఎస్పీ గారు తెలిపారు.

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.