అక్షర ఉదయమ్
Date of Publish : 13 February 2025, 7:12 pm Posted by : అక్షర ఉదయమ్

ఏలూరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అక్షర ఉదయమ్ – ఏలూరు

తంగళ్లమూడి సబ్ స్టేషన్ లో 11 కేవీ రైల్వే స్టేషన్ ఫీడర్ పరిధిలో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులను శుక్రవారం చేపట్టనున్నట్లు ఈఈ అంబేడ్కర్ తెలిపారు. దీంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంఆర్సీ కాలనీ, మావయ్య గారి తోట, బాపూజీ నగర్, వివి నగర్, ఎస్ఎంఆర్ నగర్, రైల్వే స్టేషన్ రోడ్, ఆదివారపు పేట, లక్ష్మీవారావు పేట, పెన్షన్ లైన్, గన్ బజార్ తదితర ఏరియాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.