అక్షర ఉదయమ్
Date of Publish : 28 August 2025, 12:14 am Posted by : అక్షర ఉదయమ్

నూతన అన్న ప్రసాద భవనాన్ని ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

నూతన అన్న ప్రసాద భవనాన్ని ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

అక్షర ఉదయమ్ – కాణిపాకం

కాణిపాకం దేవస్థానంలో నూతన అన్నదాన ప్రసాద భవనాన్ని నేడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు కిలికిరి మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నూతన అన్న ప్రసాద భవనం ప్రారంభించిన తుదుపరి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వంటశాలను కలియ తిరిగి పరిశీలించారు. అనంతరం అన్నవితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.