అక్షర ఉదయమ్
Date of Publish : 16 February 2025, 11:33 am Posted by : అక్షర ఉదయమ్

చిన్నపిల్లలకు కూడా జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం

అక్షర ఉదయమ్ – గుంటూరు

చిన్నపిల్లలకు కూడా జీబీఎస్ వ్యాధి రావచ్చని
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ
యశస్వి శనివారం తెలిపారు. అయితే వారు త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. అకస్మాతుగా చేతులు, కాళ్లు నీరసంగా ఉంటాయని చెప్పారు. కోనసీమ జిల్లా, నరసరావుపేట, ప్రకాశం జిల్లా నుంచి ఈ వ్యాధి బాధితులు ఇక్కడకు వచ్చారని, ఆయన తెలిపారు. జీబీఎస్ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, తాము చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.