హార్ట్ అటాక్ ను నివారించే మాత్రకు ఎఫ్డీఏ అనుమతి

గుండె పోటు, స్ట్రోక్ నివారణకు ‘రైబెల్సస్’ మందుకు ఎఫ్డీఏ ఆమోదం
నోటి ద్వారా తీసుకునే మొట్ట మొదటి GLP-1 ఔషధంగా గుర్తింపు
ఇప్పటికే టైప్-2 డయాబెటిస్ నియంత్రణకు ఈ మందు వినియోగం
రక్తనాళాల్లో వాపు, కొవ్వు ఫలకాలను తగ్గించి గుండెకు రక్షణ
సూది అవసరం లేకుండా మాత్ర రూపంలో అందుబాటులోకి రానున్న చికిత్స.
బరువు తగ్గడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.
మందు ఎలా పనిచేస్తుంది?
రైబెల్సస్.. దీనిని ఓరల్ సెమాగ్లూటైడ్ అని కూడా పిలుస్తారు. ఇది మన శరీరంలో సహజంగా ఉండే GLP-1 అనే హార్మోన్‌ను అనుకరించి పని చేస్తుంది. ఈ హార్మోన్ రక్తంలో చక్కెర స్థాయులను, ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీనితో పాటు, గుండె పోటుకు ప్రధాన కారణాలైన రక్త నాళాల వాపు (ఆర్టీరియల్ ఇన్ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కూడా ఇది సమర్థ వంతంగా తగ్గిస్తుంది. తద్వారా రక్త నాళాల్లో కొవ్వు ఫలకాలు (అథెరోస్క్లెరోసిస్) పేరుకు పోకుండా నివారిస్తూ గుండెకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తుంది. అంతే కాకుండా, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడం, చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిసరైడ్లను తగ్గించడం వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.