ఏపీ లిక్కర్ స్కామ్‌పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ లిక్కర్ స్కామ్‌పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు అక్షర ఉదయమ్ - తాడేపల్లి ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి భగ్గుమన్నారు. వ్యక్తులను మేనేజ్ చేస్తూ తన వైపు తిప్పుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగి పోయారని అన్నారు. కూటమికి మేలు చేసేందుకే విజయసాయి రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని జగన్ స్పష్టం చేశారు. ప్రలోభాలకు లోనై విజయసాయి పదవిని అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే...