అక్షర ఉదయమ్
Date of Publish : 31 January 2025, 8:26 pm Posted by : అక్షర ఉదయమ్

ఫ్రైడే – డ్రై డే

అక్షర ఉదయమ్ – బాపట్ల

బాపట్ల పట్టణ ప్రజలు అందరూ ఫ్రైడే ని డ్రై డే గా పాటించాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి చెప్పారు. బాపట్ల పట్టణంలోని కారుమూరి హనుమంతరావు కాలనీలో డ్రై డే కార్యక్రమంలో భారీ ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను దయచేసి డ్రైనేజీలో ఎలాంటి చేత గాని వస్తువులు గాని వేయవద్దని, అలా వేయడం వల్ల డ్రైనేజీలో చేత పేరుకొని పోయి దోమల బెడద ఎక్కువ అవుతుంది అని అన్నారు.