స్క్రబ్ టైఫస్ జ్వరాల పై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం
స్క్రబ్ టైఫస్ జ్వరాల పై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అక్షర ఉదయమ్ - మంగళగిరి రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ జ్వరాల నిర్ధారణ పరీక్షలను పీహెచ్‌సీ స్థాయిలోనే నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఇప్పటివరకు నమోదు అయిన తొమ్మిది మరణాలు స్క్రబ్ టైఫస్ వల్లేనంటూ తేల్చే ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. “ఈ మరణాలపై పూర్తి...