సుమారు రూ.50 లక్షల విలువైన 250 రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్
- సెల్ ఫోన్లను రికవరీ చేసి, ఉచితంగా అందజేసి బాధితులకు అండగా నిలుస్తున్న గుంటూరు జిల్లా పోలీసులు.
- ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల 82 లక్షల విలువైన 3414 మొబైల్ ఫోన్ల రికవరీ, అందజేత.
- సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే అవి దుర్వినియోగం కాకుండా 1930 జాతీయ సైబర్ క్రైమ్ సహాయత నంబర్ కి ఫిర్యాదు చేయాలని శ్రీ ఎస్పీ గారి సూచన.
- ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా సెల్ ఫోన్ నుండి చేస్తున్న ఈ రోజుల్లో సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని పిలుపు.
- ఏవైనా అనుమానిత/ బెదిరింపు కాల్స్ వస్తే 1930 కి గాని, డయల్ 112 కి గాని, దగ్గరలోని పోలీస్ వారి దృష్టికి గానీ తీసుకురావాలని సూచన.

అక్షర ఉదయమ్ – గుంటూరు
ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు రికవరీ చేసిన సుమారు 50 లక్షల విలువైన 250 దొంగిలింపబడిన మరియు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు అందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.
ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ
చాలా సందర్భాల్లో ప్రజలు తమ సెల్ ఫోన్లను పోగొట్టుకోవడం లేదా దొంగలింపబడటం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుటారు.వాటిలో వ్యక్తిగత, బ్యాంకు, ఇతర గోప్యమైన వివరాలు ఉండవచ్చు.నేరస్తులు వాటిని దుర్వినియోగ పరచవచ్చు.ఈ క్రమంలో బాధితులు పోలీసు వారికి ఫిర్యాదులు చేస్తున్నారు.
బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసు వారు పోయిన సెల్ ఫోన్ల యొక్క వివరాలను బట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, వాటిని కనుగొని, ఎటువంటి రుసుము చెల్లించకుండానే బాధితులకు ఉచితంగా అందజేస్తున్నారు.బాధితులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరైనా ప్రజలు తమ మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఎడల వెంటనే పోలీస్ హెల్ప్లైన్ నంబర్ 8688831574 లేదా CEIR వెబ్సైట్ నందు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నట్లు తెలిపారు.
ఈరోజుల్లో సెల్ ఫోన్లను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ లేదా అధిక నగదు/ఉద్యోగం/వ్యాపారం వంటి వాటిని ఆశచూపుతూ , ప్రజల ఖాతాల నుండి నగదును దోచేస్తూ వారిని మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.కావున ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరగాళ్లు చేసే ఫోన్ కాల్స్ కు భయపడకుండా ఆ ఫోన్ కాల్స్ ను వెంటనే బ్లాక్ చేసి మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ గాని లేదా జాతీయ సైబర్ భద్రత టోల్ ఫ్రీ నెంబర్ 1930 అనే నెంబర్కు గాని ఈ సమాచారాన్ని ఇచ్చి క్షేమంగా ఉండాలని అవగాహన కల్పించినారు.

సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో కృషి చేసిన ఐటీ కోర్ సీఐ నిషార్ భాష గారు, హెడ్ కానిస్టేబుల్ కిషోర్ గారు, కానిస్టేబుళ్ళు శ్రీధర్ గారు,ఇమామ్ సాహెబ్, యాసిన్, అరుణ, మానస గార్లను, సీసీఏస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ గారు, కానిస్టేబుల్ కరీముల్లా గారులను శ్రీ ఎస్పీ గారు అభినందించినారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.