అక్షర ఉదయమ్
Date of Publish : 11 October 2025, 3:50 pm Posted by : అక్షర ఉదయమ్

గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

 

అక్షర ఉదయమ్ – తిరుపతి

తిరుపతి శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (ఎస్పీసీహెచ్)లో శుక్రవారం గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. రాజమహేంద్రవరానికి చెందిన విజయకృష్ణ (28) రోడ్డు ప్రమాదంలో గాయపడి, గుంటూరు కిమ్స్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవనాన్ ద్వారా ఆయన గుండెను తిరుపతి ఎస్పీసీహెచ్ లో చికిత్స పొందుతున్న సత్యవేడుకు చెందిన 14 ఏళ్ల బాలుడికి అమర్చేందుకు నిర్ణయించారు. టీటీడీ ఈఓ ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో గుంటూరు నుంచి విజయవాడకు గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తీసుకొచ్చి, అక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఎస్పీసీహెచ్ కు తీసుకొచ్చి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథెడ్డి ఆధ్వర్యంలో గుండెను అమర్చారు. డాక్టర్ సందీప్, డాక్టర్ హర్ష, డాక్టర్ మధు వైద్య సేవలందించారు. దీంతో ఎస్పీసీహెచ్ లో గుండెమార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య 21కి చేరింది.