అక్షర ఉదయమ్
Date of Publish : 07 May 2025, 7:07 pm Posted by : అక్షర ఉదయమ్

కృష్ణా జిల్లాలోని సముద్ర తీరంలో హై అలర్ట్

కృష్ణా జిల్లాలోని సముద్ర తీరంలో హై అలర్ట్

 

భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం.

సముద్ర మార్గంలో ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు చర్యలు.

జిల్లాలో 110 కిలో మీటర్ల సముద్ర తీరం.. కృష్ణా జిల్లా పరిధిలో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు.

పాలకాయతిప్ప (కోడూరు మండలం), గిలకలదిండి (మచిలీపట్నం మండలం), ఒర్లగొందితిప్ప (కృత్తివెన్ను మండలం) మెరైన్ పీఎస్ పరిధిలో 150 మంది సిబ్బంది.

ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరైన్ పోలీసులతో పాటు రెండు డ్రోన్ కెమెరాలతో పహారా..

తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న మెరైన్ పోలీసులు.

మచిలీపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివియోగంలో లేని మెరైన్ బోట్లు.

– “అక్షర ఉదయమ్” న్యూస్