హిట్-3 క్లైమాక్స్
హిట్ సినిమాల సిరీస్ తెలుగు ప్రేక్షకుల్ని బాగానే థ్రిల్ చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో కొత్త టచ్‌తో తెరకెక్కుతున్న ఈ సిరీస్, మొదటి రెండు భాగాల విజయంతో సిరీస్ పై భారీ క్రేజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హిట్-3 తో ప్రేక్షకులను మళ్లీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, మొదటి నుంచి భారీ అంచనాల నడుమ ముందుకు సాగుతోంది. నాని ఈ సిరీస్‌లో "అర్జున్ సర్కార్"గా మరో ఇంటెన్స్ లుక్‌లో దర్శనమివ్వబోతున్నారు....