అక్షర ఉదయమ్
Date of Publish : 27 October 2025, 6:19 pm Posted by : అక్షర ఉదయమ్

రేపు కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవు

రేపు కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవు

 

అక్షర ఉదయమ్ – నరసరావుపేట

పల్నాడు జిల్లాలో ఈ నెల 28 తేదీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు, అంగన్‌వాడీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.

మొంథా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి 28వ తేదీ సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.