పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో స్త్రీ శక్తి విజయోత్సవ సభలో హోం మంత్రి అనిత ప్రసంగం

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో స్త్రీ శక్తి విజయోత్సవ సభలో హోం మంత్రి అనిత ప్రసంగం

 

 

నారా లోకేష్ యువగలం ఇదే పల్నాడు గడ్డపై ప్రారంభించారు.. మూడు తరాల నాయకులతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పని చేశారు.

ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ను వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టారు.

స్త్రీని ఒక ఆట బొమ్మగా చూడకూడదు అని ఉచిత బస్సుకి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు.

మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు తీసుకుని వచ్చారు.. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు.

వైసీపీ ప్రభుత్వం అంటే గుర్తొచ్చే మాటలు ఇసుక లిక్కర్ మాఫియా బాబాయి గొడ్డలి పోటు.

మహిళలకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు.. అసెంబ్లీలో ఎన్టీఆర్ కూతురుని అవమానించారు.

అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయ్యింది.. రాజకీయంగా మచ్చ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడును 53 రోజులు జైల్ లో పెట్టి ఇబ్బందులు పెట్టారు.

2024 ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు.. మహిళలు పెట్టిన బుద్ధికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కోసం అడుక్కుంటున్నాడు.

పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో మొన్న ఎన్నికల్లో చూశారు.

గంజాయి వైసీపీ ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల వరకు వెళ్ళింది.. కూటమి ప్రభుత్వంలో ఈగల్ టీమ్ ద్వారా గంజాయి పండించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
– హోం మంత్రి అనిత

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in