అక్షర ఉదయమ్
Date of Publish : 13 April 2025, 8:21 pm Posted by : అక్షర ఉదయమ్

అనకాపల్లి ప్రమాద బాధితులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత గారు

అనకాపల్లి ప్రమాద బాధితులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత గారు

అక్షర ఉదయమ్ – అనకాపల్లి

అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని కైలాసపట్నంలో జరిగిన ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించారు. స్థానికులు, అధికారుల సాయంతో క్షతగాత్రులను నర్సిపట్నం ఏరియా ఆస్పత్రికి, కేజీహెచ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. నర్సిపట్నం ఆస్పత్రికి వెళ్లి ఎంపీ శ్రీ సీఎం రమేష్ గారితో కలిసి అక్కడ ప్రమాద బాధితులను పరామర్శించడం జరిగింది. మృతి చెందిన కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పాను. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం.