అక్షర ఉదయమ్
Date of Publish : 01 March 2026, 1:54 pm Posted by : అక్షర ఉదయమ్

ఇరాన్ అగ్రనేత ఖమేనీ మృతి

ఇరాన్ అగ్రనేత ఖమేనీ మృతి

  • ధృవీకరించిన ఇరాన్ అధికారిక మీడియా

 

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ హతం, టెహ్రాన్‌లో ధ్వంసమైన ఖమేనీ నివాసం.. శోకసంద్రంలో ఇరాన్

గత కొన్ని గంటలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ (86) మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ ఆదివారం ఉదయం ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా టెహ్రాన్‌లోని ఆయన నివాసమే లక్ష్యంగా జరిగిన గగనతల దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ విప్లవానికి దిక్సూచిగా ఉన్న ఖమేనీ మరణంతో దేశవ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించే అవకాశం ఉంది. అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఖమేనీ హతమైనట్లు ప్రకటించగా, తాజాగా ఇరాన్ మీడియా కూడా దీనిని ధృవీకరించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది., కుప్పకూలిన భవనం.. చెల్లాచెదురైన నాయకత్వం:, శనివారం తెల్లవారుజామున జరిగిన అతిపెద్ద దాడిలో ఖమేనీ ఉంటున్న పటిష్టమైన భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఆ ప్రాంతం మొత్తం శిథిలాలయంలా మారింది. ఖమేనీతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కీలక కమాండర్లు, రక్షణ మంత్రి కూడా ఈ దాడుల్లో మరణించినట్లు సమాచారం. 1989 నుంచి ఇరాన్ పగ్గాలు చేపట్టిన ఖమేనీ యుగం ముగియడంతో, తదుపరి వారసుడు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.