అక్షర ఉదయమ్
Date of Publish : 29 May 2025, 5:38 pm Posted by : అక్షర ఉదయమ్

ఏపీలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు

ఏపీలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు

అక్షర ఉదయమ్ – విజయవాడ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని మరో మూడు నెలలు పాటు జూన్ 1, 2025 నుండి ఆగష్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్ల గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మే 31 నాటికి అక్రిడిటేషన్ కార్డులు పని చేస్తున్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు జూన్ 1, 2025 నుండి ఆగష్టు 31, 2025 వరకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని ఒక ప్రకటనలో సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్ల తెలియజేశారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..