అన్నవరం కొండమీద జరిగిన కారు డిక్కీ దొంగతనం కేసును చేధించిన కాకినాడ జిల్లా పోలీసులు

అన్నవరం కొండమీద జరిగిన కారు డిక్కీ దొంగతనం కేసును చేధించిన కాకినాడ జిల్లా పోలీసులు

 

  • 965 గ్రాముల బంగారం స్వాధీనం 
  • నిందితుడుపై మరో 4 కేసులు, అరెస్టు

 

అక్షర ఉదయమ్ – కాకినాడ

కాకినాడ జిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 27న శ్రీ సత్యనారాయణ స్వామి వారి కొండమీద జరిగిన కారు డిక్కీ దొంగతనం కేసులో, కాకినాడ జిల్లా గౌరవనీయులైన ఎస్పీ శ్రీ G.బిందు మాధవ్ ఐపీఎస్ వారు ప్రత్యేక ఆదేశాలతో, పెద్దాపురం శ్రీ SDPO శ్రీ హరి రాజు గారు పర్యవేక్షణలో, ప్రత్తిపాడు శ్రీ CI సూర్య అప్పారావు గారు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, కేసుకు చేధించిన కాకినాడ జిల్లా పోలీసులు.

నిన్నాటి రోజు అనగా 20-8-2025 తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రత్తిపాడు సిఐ గారు కి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు అన్నవరం కొండమీద Ertiga car తో అనుమానాస్పదంగా ఉన్న అనే వ్యక్తిని పట్టుకొని విచారించిగా, సులభమైన పద్ధతులలో అక్రమంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలు వద్ద, సముద్ర తీరాలలో పార్కింగ్ చేసి ఉంచిన కార్లు నుండి బంగారు వస్తువులను దొంగతనం చేసినట్లుగా అంగీకరించగా, అతని వద్ద నుండి ఐదు కేసులకు (అన్నవరం 2 కేసులు, తిమ్మాపురం 2 కేసులు , ద్వారకాతిరుమల 1 కేసు) సంబంధించిన 965 గ్రాముల బంగారం వస్తువులను స్వాధీన పరుచుకుని, అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం శ్రీ ప్రత్తిపాడు గౌరవ మ్యాజిస్ట్రేట్ వారి ముందు హాజరు పరచడం జరుగుతుంది.

 

ఈ కేసును చేదించిన పెద్దాపురం SDPO శ్రీ హరిరాజు గారిని, ప్రత్తిపాడు ఇన్స్పెక్టర్ శ్రీ బి సూర్య అప్పారావు గారిని, అన్నవరం S.Is శ్రీహరిబాబు , ప్రసాద్ గార్లు వారి క్రైమ్ సిబ్బంది HC రమణ 2595, PCs1372 నాగేశ్వరావు, 3630 శ్రీనివాస్, HG 816 నాగేశ్వరావు లను మరియు కాకినాడ IT core team సిఐ శ్రీ డి. దుర్గ శేఖర్ రెడ్డి గారు, HC-2350 Ch. H. ప్రసాద్, PC-2363 P.S.M.A. స్వామిలను జిల్లా SP గారు అభినందించారు.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in