వ్యవసాయం కోసం ముల్టి పర్పస్ రోబోను తయారు చేసిన కోటేశ్వరరావు

అక్షర ఉదయమ్ - ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ జి. కోటేశ్వర రావు కొనకనమిట్ల మండలం చినారికట్లలో యాభై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రాళ్ల నేలలోనే వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించుకునే దిశలో ముల్టి పర్పస్ రోబోను తయారుచేశారు. దున్నడం, విత్తనాలు వెదజల్లడం, కలుపు తీయడం, కోత పనులతో పాటు రెండు స్ప్రయర్లను ఉపయోగించి పురుగుమందులను పిచికారీ చేయడానికి రూపొందించారు. పొలంలోకి దిగ కుండానే రిమోట్ సాయంతో ఈ పనులన్నీ చేయవచ్చు....