ఏటికొప్పాక కళకు మరింత ఊతం : మంత్రి సవిత

అక్షర ఉదయమ్ - అమరావతి: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో నిర్వహించిన పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం తృతీయ స్థానంలో నిలవడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయలను చాటిచెప్పేలా రూపొందించిన ఏటికొప్పాక బొమ్మల శకటం దేశ ప్రజలతో పాటు ప్రధాని నరేంద్రమోడిని సైతం ఆకట్టుకుందన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ హస్తకళాకారుల...