అక్షర ఉదయమ్
Date of Publish : 13 April 2025, 8:06 pm Posted by : అక్షర ఉదయమ్

అనకాపల్లి జిల్లాలో భారీ ప్రమాదం, బాధితులకు రూ.15 లక్షల పరిహారం

అనకాపల్లి జిల్లాలో భారీ ప్రమాదం, బాధితులకు రూ.15 లక్షల పరిహారం

అక్షర ఉదయమ్ – అనకాపల్లి

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణా సంచా కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందారు.

దీంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున హోంమంత్రి అనిత ప్రకటించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మరోవైపు ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మృతులు కూలీలు కావడంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.