మంగపతికి మెగా ప్రశంసలు

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

     

    “అక్షర ఉదయమ్” సినిమా న్యూస్

    హీరో నాని నిర్మాణంలో వచ్చిన “కోర్టు” సినిమా తెలుగు సినిమా ప్రియులకు ఒక విభిన్నమైన అనుభవాన్ని అందించింది. జగదీష్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి కీలక పాత్రలలో కనిపించారు. అలాగే సీనియర్ నటుడు శివాజీ మరో కీలక పాత్రలో మెరిశారు. ఈ చిత్రంలో శివాజీ పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్య పరిచి, ఆకట్టుకుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో శివాజీ కేవలం నటించ లేదు.. ఆ పాత్రలో జీవించారు. తన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి జోలికి వచ్చాడని చందు అనే కుర్రాడిని ఇబ్బంది పెట్టే ఈ పాత్రలో ఆయన చూపించిన తీవ్రత, ఫెరోషియస్ నటన అందరి మనసులనూ ఆకర్షించింది. ఈ పాత్ర ద్వారా శివాజీ తన నటనా ప్రతిభకు మరోసారి తార్కాణం చాటారు.

    నిజానికి మంగపతి పాత్ర ఒక సాధారణ విలన్ పాత్ర కాదు.. అది ఒక సంక్లిష్టమైన, మల్టీఫేస్డ్ ఎమోషన్స్ తో కూడిన పాత్ర. శివాజీ ఈ పాత్రకు ప్రాణం పోశారు. ఆయన చూపుల్లోని కోపం, మాటల్లోని ఆధిపత్యం, చేష్టల్లోని దౌర్జన్యం.. ఇవన్నీ కలిసి మంగపతిని తెరపై ఒక శక్తివంతమైన పాత్రగా నిలబెట్టాయి. చందుని ఇబ్బంది పెట్టే సన్నివేశాల్లో ఆయన చూపించిన నటన ప్రేక్షకులను ఒక్కసారిగా ఆ పాత్రను ద్వేషించేలా, అదే సమయంలో ఆ నటనను మెచ్చుకునేలా చేసింది. అది శివాజీ నటనా సామర్థ్యానికి నిదర్శనం.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...

    పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

    పోలింగుకు ముందే కూటమి సత్తా  పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   అక్షర ఉదయమ్ -...