అక్షర ఉదయమ్
Date of Publish : 21 August 2025, 7:31 pm Posted by : అక్షర ఉదయమ్

డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితా 22న..?

డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితా 22న..?

 


అక్షర ఉదయమ్ – అమరావతి

మెగా డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యా శాఖ సిద్ధమైంది. ఈ నెల 22న (శుక్రవారం) మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది. సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి.. ఆన్లైన్లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యా శాఖ జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహించింది. జూన్ 6 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) జరిగాయి. అన్ని పోస్టులకు కలిపి 3,35,401 మంది 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మార్కుల సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in