అక్షర ఉదయమ్
Date of Publish : 28 January 2025, 5:54 pm Posted by : అక్షర ఉదయమ్

శంబర పోలమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

అక్షర ఉదయమ్ – పార్వతీపురం: శంబర పోలమాంబకు మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి సంధ్యా రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నారాయణరావు, అర్చకులు సంప్రదాయబద్దంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి పట్టువస్త్రాలు అందించి, ఆలయ సంప్రదాయంతో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించాలని ఆకాక్షించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే మహత్కర భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.