ప్రజా సౌకర్యాల కమిటీ సభ్యునిగా ఎమ్మెల్యే “యరపతినేని”

ప్రజా సౌకర్యాల కమిటీ సభ్యునిగా ఎమ్మెల్యే “యరపతినేని”

 

 

అక్షర ఉదయమ్ – అమరావతి 

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా సౌకర్యాల కల్పనా కమిటీ సభ్యునిగా పల్నాడు జిల్లా గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు నియమితులయ్యారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు లెజిస్లేచర్ సెక్రెటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలసీలు రూపొందించడంలో, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ఈ కమిటీ ముఖ్య పాత్ర పోషించనుంది.