గురజాల నియోజక వర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యరపతినేని
అక్షర ఉదయమ్ - పల్నాడు గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు శనివారం నియోజక వర్గ ప్రజలందరికీ "విశ్వావసు" నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజక వర్గ ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, పాడి, పంటలతో, ఆయు, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని ఎమ్మెల్యే యరపతినేని చెప్పారు. "విశ్వావసు నామ సంవత్సరం" సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగించాలని, ఉగాది పచ్చడి జీవితంలోని 6 వైవిధ్యమైన అభిరుచులైన తీపి,...