గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే యరపతినేని విజ్ఞప్తి
అక్షర ఉదయమ్ - పల్నాడు జిల్లా : ఏపీలో మురసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాల నియోజక వర్గ ప్రజలందరికీ శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మురసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ, పంటలు, పశువుల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకి దూరం ఉండాలని ఎమ్మెల్యే యరపతినేని కోరారు....