సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే “యరపతినేని“
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు.
గురజాల నియోజక వర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని, ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించు కోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 35 (28 చెక్కులు 7 ఎల్ఓసీలను) మంది లబ్ధిదారులకు యరపతినేని శ్రీనివాసరావు ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల రెండు వందల డెబ్భై ఐదు రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటి వరకు 545 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలను చెక్కుల రూపంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అందజేశారు.