మెడికల్ కళాశాలకు 100 సీట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి, మంత్రులకు ఎమ్మెల్యే “యరపతినేని” కృతజ్ఞతలు

మెడికల్ కళాశాలకు 100 సీట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి, మంత్రులకు ఎమ్మెల్యే “యరపతినేని” కృతజ్ఞతలు

 


అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి మెడికల్ కళాశాలకు 100 సీట్లు అడ్మిషన్లు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కి గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.

పల్నాడు జిల్లా గురజాల నియోజక వర్గంలోని పిడుగురాళ్ళ పట్టణ సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలకు ఈ విద్యా సంవత్సరం (2026-27) లోనే 100 మెడికల్ సీట్లు కేటాయింపు చేయడంపై ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద బ్రాహ్మణపల్లి మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం 195 కోట్లు మంజూరు చేయగా, గత వైసిపి ప్రభుత్వ పాలనలో మెడికల్ కళాశాల నిర్మాణం కొరకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని, పనులు నత్త నడకన కొనసాగాయని యరపతినేని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు నిర్మాణాలు పూర్తి కాక ముందే ఆర్భాటంగా అప్పటి వైసీపీ నేతలు ప్రారంభించారని యరపతినేని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఏడాదిన్నర పాలనలో మెడికల్ కళాశాల నిర్మాణంపై అధికారులతో కలిసి పలు సమీక్షలు చేసి, మెడికల్ కళాశాలను సందర్శించి పనులు వేగవంతం చెయ్యాలని అధికారులకు సూచించడం జరిగిందని అన్నారు. జాతీయ వైద్య మండలి సిఫారసు మేరకు ఈ విద్యా సంవత్సరం (2026-27) లోనే బ్రాహ్మణపల్లి మెడికల్ కళాశాలకు 100 మెడికల్ సీట్లు, అడ్మిషన్లు కేటాయింపు జరిగేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కి గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.