ఏపీపై మురసు ఎఫెక్ట్ – పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు
అక్షర ఉదయమ్ - విజయవాడ : ఏపీలో పలు జిల్లాలో మురసు తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచే వానతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు అర్నబ్ మిగిల్చిన నష్టం నుంచి కోలుకోక ముందే మళ్లీ వర్షం రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పడు తుపాను పరిస్థితి అంచనావేస్తూ తగు సూచనలు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. గంట్యాడ మండలంలో జోరుగా...