నాగార్జునసాగర్ రవాణా శాఖ సరిహద్దు తనిఖీ కేంద్రం మూసివేత

అక్షర ఉదయమ్ – నాగార్జున సాగర్
నాగార్జునసాగర్ లోని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ కు చెందిన సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి నుంచి మూసివేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కీలక నిర్ణయంతో వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు. గతంలో చెక్‌పోస్టుల వద్ద జరిగే తనిఖీలు, పన్నుల వసూళ్ల వల్ల ప్రయాణికులు, రవాణాదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ సమస్యకు ముగింపు పలకడం వల్ల సరుకు రవాణా, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి. భవిష్యత్తులో
ఈ-టెక్నాలజీ, సీసీటీవీ పర్యవేక్షణ ద్వారా వాహనాల తనిఖీలను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అధికారులు తెలిపారు.
గతంలో రాష్ట్రంలో దాదాపు చాలా వరకు తనిఖీ కేంద్రాలను మూసివేయగా బుధవారం రాత్రి నుంచి నాగార్జునసాగర్ తనిఖీ కేంద్రాన్ని మూసివేశారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో రవాణా తనిఖీ కేంద్రాలు కనిపించవని. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వాహనాలకు సరుకు రవాణా సమయాన్ని తగ్గించడమే కాకుండా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకునట్లు, జీఎస్టీ అమలు తర్వాత తనిఖీ కేంద్రాలతో అవసరం లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో దీనికి అనుగుణంగా పలు రాష్ట్రాలు తమ చెక్‌పాయింట్లను ఎత్తివేయగా తాజాగా నాగార్జునసాగర్ కూడా ఈ జాబితాలో చేరింది. ఇకనుంచి రవాణా శాఖకు చెందిన అన్ని సేవలు ఆన్లైన్లో లభ్యం కానున్నాయి.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.