అక్షర ఉదయమ్
Date of Publish : 15 July 2025, 3:04 pm Posted by : అక్షర ఉదయమ్

సీఆర్డీయే ప్రాంతానికి మాత్రమే నారాయణ మంత్రి కాదు

సీఆర్డీయే ప్రాంతానికి మాత్రమే నారాయణ మంత్రి కాదు

– వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్

 

 

 

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

 

 

మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ సీఆర్డీయే ప్రాంతానికి మాత్రమే మంత్రి కాదని.. ఈ రాష్ట్రానికి కూడా మంత్రి అని గుర్తుంచు కోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ హితవు పలికారు.

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు చింతలపూడి మద్దతు తెలిపారు. గత మూడు రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదని, కార్మికుల కుటుంబాలను పస్తుల నుంచి కాపాడుకోవడానికి మాత్రమే ఈ సమ్మె చేస్తున్నారని అన్నారు. జీవో నెంబర్ 36 ప్రకారం వారి జీతాలు పెంచాలని, కార్మికులందరికీ కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని డాక్టర్ అశోక్ బాబు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in