ఎస్ ఎల్ బి సి టన్నెల్‌లోకి ‘ఆక్వా ఐ’ పరికరాన్ని పంపించిన నేవీ
అక్షర ఉదయమ్ - నాగర్ కర్నూలు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని గుర్తించే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు నేవీ బృందం "ఆక్వా ఐ" పరికరాన్ని టన్నెల్‌లో ప్రవేశపెట్టింది. గత మూడు రోజులుగా సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. అయితే, టన్నెల్ లోపల నాలుగైదు అడుగుల మేర బురద, నీరు ఉన్న కారణంగా, బాధితుల వద్దకు చేరుకోవడం కష్టంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో SLBC టన్నెల్ లోపల, 14వ...