ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా : ప్రభుత్వం ఉత్తర్వులు
అక్షర ఉదయమ్ - అమరావతి ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియమితులయ్యారు. గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి ప్రస్తుతం డిజిపిగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు. హరీష్‌కుమార్‌గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా గుప్తా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు డీజీపీగా గుప్తా కొనసాగనున్నారు.