పల్నాడు మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం

పల్నాడు మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం

 

అక్షర ఉదయమ్ – పల్నాడు

మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్ల ఐఏఎస్, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపిఎస్ గారు

ఈరోజు కలెక్టర్ ఆఫీసు నందు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్ల ఐఏఎస్ గారి అధ్యక్షతన జిల్లా మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశం నందు శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ

జిల్లా వ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్‌స్పాట్‌ లపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసినట్లు, మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న అనుమానిత వ్యక్తుల నివాస ప్రాంతాలను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో అసంపూర్తిగా నిర్మించి ఉన్న భవనాలు, ఖాళీగా వదిలివేసిన భవనాలలో కార్యకలాపాలపై నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు.

ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదై, ఎక్కువ మొత్తంలో గంజాయి సరఫరా చేస్తూ లేదా అమ్ముతూ దొరికిన వారి ఆస్తులు జప్తు చేస్తామన్నారు.

మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు స్కూళ్ల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా సంస్థలలో ఈగిల్ క్లబ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు.

డీ-అడిక్షన్ సెంటర్లు, పునరావాస సహాయం కోసం అవుట్‌రీచ్ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఏరియా హాస్పిటల్ నందు ఉన్న డీ-అడిక్షన్ సెంటర్, కొత్తగా ఏర్పాటైన డీ-అడిక్షన్ సెంటర్ నందు అవసరమైన సిబ్బందిని నియమించాలని DMHO రవి గారిని కోరారు.

మాత జ్ఞానమ్మ డీ-అడిక్షన్ సెంటర్ ను సైకియాట్రిస్ట్ గారు నెలకు రెండు సార్లు విజిట్ చేయాలన్నారు.

మాదక ద్రవ్య దుర్వినియోగ నిర్మూలన లో బాధ్యతాయుతమైన అన్ని శాఖల సమన్వయంతో చురుకుగా పాల్గొనాలన్నారు.

మాదక ద్రవ్యాల పై అవగాహన ఇంటర్ – డిపార్ట్‌మెంటల్ సహకారంతో వీలైనన్ని ఎక్కువ అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్దులు మరియు ప్రజలలో మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాలపై చైతన్యం కలిగించాలని తెలిపారు.

ఈ సమావేశంలో శ్రీమతి కలెక్టర్, ఎస్పీ గారితో పాటు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ రవి, DCHS జి.పి.ఎస్ రాజు గారు, ఏ.జి.అండ్ ఏం.సి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమాదికారి ఏం. ఉమాదేవి గారు, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి, ఎస్.వి.నాగేశ్వర రావు నాయక్ గారు, DCGSWS అధికారి ఏ.పి గోపిరెడ్డి గారు, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సునీత గారు, SB CI -2 P.శరత్ బాబు గారు, ఈగల్ సెల్ ఎస్సై శామ్యూల్ రాజీవ్ గారు పాల్గొన్నారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.