పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు
అక్షర ఉదయమ్ - నరసరావుపేట పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ గారు. ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ - పెండింగ్ కేసులను హేతుబద్దంగా విశ్లేషించి తగ్గించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సున్నితమైన భాషతో మాట్లాడాలని వారితో మమేకమై సమస్యలను ఓపికగా విని, ఫలితంగా బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని పోలీస్ అధికారులకు సూచించారు. మహిళలు, బాలికలు,...