విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అక్షర ఉదయమ్ - విజయవాడ  గత ఐదేళ్లుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం మాత్రమే ప్రజల్లో ఉంది, కానీ టిడ్కో ఇళ్ళ వెనుక సొంత కాళ్ళపై నిలబడే ఒక బలమైన వ్యవస్థను కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం విజయవాడ రూరల్ జక్కంపూడిలో 2018లో నిర్మాణం చేపట్టిన “ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్”ను...