అక్షర ఉదయమ్
Date of Publish : 05 March 2025, 7:37 pm Posted by : అక్షర ఉదయమ్

విద్యుత్ ప్రభలకు అనుమతి తప్పనిసరి

అక్షర ఉదయమ్ – అద్దంకి

 

సింగరకొండ 70వ వార్షిక తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా విద్యుత్ ప్రభల నిర్వాహకులు పోలీస్ శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. పది మంది కంటే తక్కువగా కాకుండా విద్యుత్ ప్రభల నిర్వాహకులు కమిటీగా ఏర్పడాలని అన్నారు. అసభ్యకర మాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలు తిరునాళ్ళ లో చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బరాజు హెచ్చరించారు.

సీసీ కెమెరాలు పర్యవేక్షణలో సింగరకొండ తిరునాళ్ళు

ఈనెల 12 నుండి 14వ తేదీ వరకు జరగబోయే సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 70వ వార్షిక తిరునాళ్లు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటాయని సిఐ సుబ్బరాజు తెలిపారు. సీసీ కెమెరాలు పనితీరును స్వయంగా పరిశీలించారు. ఇంకా ఎక్కడైనా సీసీ కెమెరాలు అవసరమైతే ఏర్పాటు చేయాలని సూచించారు. స్టేషన్ ఆఫీసర్ కు పోలిస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దేవాలయ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.