మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పొట్లూరి స్రవంతి
అక్షర ఉదయమ్ – నెల్లూరు
నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి తన మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈరోజు కలెక్టర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు. గిరిజన బిడ్డ అయిన తనను ఎదుర్కోలేక కొందరు కుట్రలు చేస్తున్నారని, తనకు మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ పరిణామం నెల్లూరు రాజకీయాల్లో కలకలం రేపింది.