అక్షర ఉదయమ్
Date of Publish : 14 February 2025, 11:57 pm Posted by : అక్షర ఉదయమ్

మంగళగిరిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

అక్షర ఉదయమ్ – మంగళగిరి

 

మంగళగిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని డీఈ సురేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్క్ రోడ్డు, నిడమర్రు రోడ్డు, టిప్పర్ల బజార్, మన్యం బజార్, మార్కండేయ కాలనీ, కుబేర రైస్ మిల్లు, కొండపనేని టౌన్ షిప్, రత్నాల చెరువు, లక్ష్మీ నరసింహ కాలనీ, శ్రీశైల నగర్, తెనాలి బ్రిడ్జి ఏరియా ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.