అక్షర ఉదయమ్
Date of Publish : 21 May 2025, 10:08 pm Posted by : అక్షర ఉదయమ్

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపీఎస్., గారు

  • పోలీసు సిబ్బంది, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ లతో విస్తృతంగా తనిఖీలు
  • ఎవరైనా నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

– “అక్షర ఉదయమ్” న్యూస్ 

జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మరియు అసాంఘిక శక్తుల కదలికలను నిరోధించేందుకు కనిగిరి, పామూరు పట్టణం నందు మరియు సింగరాయకొండ, కొండేపి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు మరియు సిబ్బందితో కలసి, ప్రత్యేక పోలీస్ బలగాలు స్పెషల్ పార్టీ, స్వాట్ టీం, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతమైన తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ముఖ్యమైన కూడళ్లలో, రహదారులపై వాహనాలు, పలు ఇళ్లల్లో, శివారు ప్రాంతాల్లో, పాత నేరస్తుల ఇళ్లలలో, చెడు నడతకలిగిన వారు, గంజాయి అక్రమ రవాణా, లాడ్జి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు మరియు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు.

ఈ తనిఖీలో ప్రధాన ప్రదేశలలో వాహన తనిఖీలు చేసి సరైన లైసెన్స్/రిజిస్ట్రేషన్/ పత్రాలు లేనివి, మాడిఫైడ్ సైలెన్సర్లు,ఇన్సూరెన్సు, నంబర్‌ ప్లేట్లు లేని/ ఇర్రెగ్యులర్ నంబర్‌ ప్లేట్లు, త్రిబుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు, ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న మాడిఫైడ్ సైలెన్సర్‌లు ఉన్న ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లకు పంపటం జరిగింది.

లాడ్జీలను, డార్మోట్స్ తనిఖీ చేసి,కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీసి అనుమానిత వ్యక్తులని ప్రశ్నిస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్టమైన నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. పోలీస్ అధికారులు చెడునడత గల వారి యొక్క జీవనాధారం మరియు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన యెడల చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు.

జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా మరియు ప్రజల యొక్క భద్రతను కల్పించుటకు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడం, అనుమానితులను తనిఖీ చేయటం, నేరాలను నియంత్రించడం విజిబుల్ పోలీసింగ్ ముఖ్య ఉద్దేశ్యమని ఎస్పీ గారు వివరించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాలను అడ్డుకట్ట వేయటం కొరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ ఎంతో సహాయపడుతుందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ గారు కోరారు.

ప్రజల భద్రత, నేర నియంత్రణ దృష్ట్యా ఈ తనిఖీలు నిర్వహించామని, చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100/112 తెలియజేయాలని అక్కడి ప్రజలను కోరారు.

ఈ తనిఖీలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, నాగరాజు, రమణ కుమార్, శ్రీనివాసరావు, SB ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర,సీఐలు సుబ్బారావు, బీమా నాయక్, మల్లికార్జున, రామకోటయ్య, సురేష్, ప్రభాకర్, నాగరాజు, రామారావు, సోమశేఖర్, హాజరత్తయ్య, ఖాజావలి, సీఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..