ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా అక్షర ఉదయమ్ - నెల్లూరు నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున ఫ్లైఓవర్ పై డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు, డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మందికి స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అతి వేగం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు....