ముంబైని ముంచెత్తుతున్న వర్షం
ముంబైని ముంచెత్తుతున్న వర్షం దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వాన ముంచెత్తుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై మహానగరంలో పలు రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వాతావరణశాఖ ముంబై సమీప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ముంబై వాసులు ఇబ్బంది పడుతున్నారు. - "అక్షర ఉదయమ్" న్యూస్ Stay Updated with Every Breaking News...