ఏ ఎండకా గొడుగు పట్టే కార్మిక నాయకులు వద్దు
- న్యూ రాజమండ్రి ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అక్షర ఉదయమ్ - రాజమహేంద్రవరం: ఏ ఎండకా గొడుగు పట్టే కార్మిక నాయకులు మనకొద్దని, మన కోసం పాటు పడే నాయకులనే అనుసరించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ది న్యూ రాజమండ్రి ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వాసు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా టీఎన్టీయుసి అధ్యక్షులు (మాజీ)...