అక్షర ఉదయమ్
Date of Publish : 02 February 2025, 2:12 am Posted by : అక్షర ఉదయమ్

రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో పట్టివేత

అక్షర ఉదయమ్ – పొన్నూరు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం జిబిసి రోడ్డు మామిళ్ళపల్లి అడ్డ రోడ్డు వద్ద శుక్రవారం రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను ముందస్తు సమాచారం మేరకు పొన్నూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం ఆటోను స్టేషన్ కి తరలించి డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం ఎక్కడవి? ఎవరు తరలిస్తున్నారు? అనే కోణంలో విచారిస్తున్నట్లు రూరల్ ఎస్సై కిరణ్ బాబు మీడియాకు తెలిపారు.